Geetha-Govindam---Vijay-Deverakondaఎంతోమంది యువహృదయాల మనసు దోచుకున్న విజయ్ దేవరకొండ అభిమాన హీరో ఎవరో తెలుసా? ‘సంజూ’ సినిమా ద్వారా బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన రణబీర్ కపూర్. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్పష్టం చేసారు. అలాగే మల్టీస్టారర్ చేయాల్సి వస్తే ఏ హీరోతో చేస్తారని? మీడియా ప్రతినిధి అడుగగా, దానికి కూడా తనదైన శైలిలో సమాధానం వెలిబుచ్చాడు.

ప్రస్తుతం తన దగ్గర ఓ స్క్రిప్ట్ ఉందని, దానిని తమిళ హీరోలు కార్తీ గానీ, విజయ్ సేతుపతి గానీ చేస్తే బాగుంటుందని, తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించదగ్గ సినిమా ఇదని పేర్కొన్నాడు. ఇండియాలో గోవా స్పాట్ అంటే తనకు ఇష్టమని, ప్రస్తుత తరంలో తన ఫేవరేట్ పొలిటిషియన్ కేటీఆర్ అని తెలిపాడు విజయ్. అలాగే భవిష్యత్తులో కూడా తాను పాటలు పాడి తీరుతానని ఈ సందర్భంగా స్పష్టత ఇచ్చాడు.

ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోన్న ఈ సినిమా సెలబ్రేషన్స్ ను ఆదివారం నాడు చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్లాన్ చేసింది. ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరు కానున్నారని అధికారిక ప్రకటన చేసింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హాజరు కాగా, ఇప్పుడు సక్సెస్ సెలబ్రేషన్స్ కోసం ఏకంగా మెగాస్టార్ రంగంలోకి దిగుతున్నారు.