Vijay-Deverakonda-Knows-What-He-Is-Doing---Rajamouli“గీత గోవిందం” సినిమా ద్వారా ప్రస్తుతం యువతరాన్ని ఒక ఊపు ఊపేస్తోన్న విజయ్ దేవరకొండ, ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూకు కూడా లక్షల క్లిక్స్ దక్కుతున్నాయంటే, ఈ బాబు రేంజ్ ఏమిటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఇంటర్వ్యూలో మరొకసారి తన స్వరాన్ని సవరించి ‘ఇంకేం ఇంకేం కావాలే’ అన్న పాటను వినిపించారు.

ఈ ఇంటర్వ్యూలో భాగంగా మీడియా ప్రతినిధి… మీ నోట ఇంకేం ఇంకేం పాట పాడితే ఎలా ఉంటుందో వినాలని ఉంది అనగా, ఏ మాత్రం సందేహించకుండా మ్యూజిక్ ప్లే చేస్తాను పాడతాను అన్న విజయ్ దేవరకొండ, “సిగ్గులేకపోవడం అంటే ఇదే అంటారు, ఇంత ట్రోల్ చేసిన తర్వాత మళ్ళా పాడడం ఏంటి అసలు” అనడంతో సదరు మీడియా ప్రతినిధితో పాటు, వీక్షకులు కూడా నవ్వేసారు.

‘టీవీ9 వాళ్ళు నా గొంతు వినాలనుకుంటున్నారు’ అంటూ ప్రారంభించిన విజయ్ దేవరకొండ, ‘మీరు కూడా పాడితే ఇద్దరం కలిసి ట్రోల్ అవుతాము, పాడండబ్బా…’ అంటూ వినోదాన్ని పండించాడు. ఆ తర్వాత ఫోన్ లో పాట పెట్టుకుని, రెండు సార్లు ‘ఇంకేం ఇంకేం కావాలే’ అన్న పాటను తన స్వరంతో వినిపించాడు ఈ క్రేజీ స్టార్. సెట్ లో ఎప్పుడు ఇలాగే పాడుతుంటాను, అందుకే నా చేత దర్శకుడు పాడించారని తెలిపారు.

ఈ సినిమాలో గోవింద్ అంత మంచోడు ఎవడూ ఉండడు, మీరు దీప్తికి చెప్పాలి (గతంలో అర్జున్ రెడ్డి ఇంటర్వ్యూ చేసిన దీప్తి), మంచితనం మంచితనం అంటూ చావకొట్టింది నన్ను ఒకసారి, విజయ్ దేవరకొండ మీ కోసం ఓ మంచి సినిమా చేసాడు, తప్పకుండా చూడండి… అంటూ గతంలో జరిగిన ఉదంతాన్ని గుర్తు చేసి నవ్వించాడు. ఇంటర్వ్యూ అయిన తర్వాత కూడా ఎలాంటి వివాదం లేకుండా ఈ మీడియా ఛానల్ తో ముగిసింది అంటూ నవ్వించాడు విజయ్.