Geetha - Govindam - Video Songsగోపి సుందర్ సంగీతం అందించిన “గీత గోవిందం” ఆల్బమ్ అద్భుతంగా ఉందన్న టాక్ వచ్చేసింది. ‘ఇంకేం కావాలే’ అన్న పాట మిలియన్ క్లిక్స్ తో రోజురోజుకూ యూ ట్యూబ్ లో దూసుకుపోతుండగా, తాజాగా జరిగిన ఆడియో వేడుకలో ఈ సినిమాకు సంబంధించిన వీడియో సాంగ్స్ ప్రోమోలను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఈ సినిమాలో మొత్తం అయిదు పాటలు ఉండగా, నాలుగు పాటలకు సంబంధించిన వీడియో ప్రోమోలను రిలీజ్ చేసారు. ఈ నాలుగు పాటల ప్రోమోలు కూడా విజువల్ గా చాలా బాగున్నాయి. వినడానికి వీనులవిందుగా, వీక్షించడానికి కన్నులవిందుగా… మొత్తంగా చెప్పాలంటే ఆహ్లాదకరంగా ఉన్న ఈ వీడియో సాంగ్స్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసాయి.