geetha-govindamv-Rashmika-Vijay-Deverakondaఈ వారం టాలీవుడ్ కు పూర్తి నిరాశే ఎదురయ్యింది. “ఆర్ఎక్స్ 100” బ్లాక్ బస్టర్ ను “గూఢచారి” కొనసాగించగా, “ఛి||ల||సౌ||” కూడా హిట్ టాక్ తెచ్చుకుని మంచి వసూళ్లను సాధించింది. అయితే దిల్ రాజు నిర్మాతగా భారీ అంచనాలు పెట్టుకున్న “శ్రీనివాస కళ్యాణం” బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయింది. తొలిరోజు చాలా సాధారణమైన ఓపెనింగ్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా టాక్ కూడా ఆశాజనకంగా లేదు.

ఇక కమల్ తన “విశ్వరూపం 2″ను ప్రదర్శిస్తాడని భావించగా, అది కూడా విఫలం చెందిందని తేలిపోయింది. దీంతో గత వారం విడుదలైన “గూఢచారి, ఛి||ల||సౌ||” సినిమాలే ప్రేక్షకులకు ఛాయిస్ గా మారాయి. అయితే ఇదంతా “గీత గోవిందం” సినిమాకు గ్రౌండ్ సెట్ చేసి ఉన్నట్లుగా కనపడుతోంది. “అర్జున్ రెడ్డి” తర్వాత స్టార్ గా మారిపోయిన విజయ్ దేవరకొండ అంటే యూత్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా ప్రమోషన్స్ కూడా భారీగా జరిగాయి. ముఖ్యంగా ‘ఇంకేం ఇంకేం కావాలె’ అన్న పాట అయితే ఏకంగా 40 మిలియన్ క్లిక్స్ దాటిపోయి, దూసుకుపోతుండడం విశేషం. ట్రేడ్ వర్గాల్లో కూడా ఈ సినిమాపై పాజిటివ్ టాక్ ఉంది. అన్నీ కలిసి వస్తే… విజయ్