Geetha-Govindam-Collectionsబ్లాక్ బస్టర్ కలెక్షన్స్ ను సాధిస్తూ విజయ్ దేవరకొండ కెరీర్ ను మరో మెట్టు ఎక్కిస్తూ అపూర్వమైన విజయం సాధించిన “గీత గోవిందం” సినిమా రిలీజ్ కు ముందు పైరసీతో జరిగిన ప్రచారం తెలిసిందే. ఈ ఉదంతంలో పలువురు విద్యార్ధులు కూడా అరెస్ట్ కావడం చర్చనీయాంశంగా మారగా, విడుదలకు సినిమా సీన్స్ ను షేర్ చేసుకోవడం గానీ, చూడడం గానీ పెద్ద క్రైమ్ క్రిందికి వస్తుందని అల్లు అరవింద్ వంటి సినీ పెద్దలు ప్రత్యేకంగా పేర్కొన్నారు.

అయితే సినిమా రిలీజ్ కు ముందు అంతా హంగామా చేసిన చిత్ర యూనిట్, రిలీజ్ అయిన కొద్దిగంటలకే పైరసీకి సంబంధించిన లింక్ లు ప్రత్యక్షమైనా ఎలాంటి చర్యలు చేపట్టలేకపోయారు. రిలీజ్ కు ముందు గొంతెత్తి గట్టిగా వినిపించిన వారంతా, రిలీజ్ తర్వాత చాలా లైట్ గా తీసుకున్నారు. బహుశా ‘గీత గోవిందం’ సినిమాకు వస్తున్న కలెక్షన్స్ తో సంతృప్తి పడ్డారో లేక రిలీజ్ తర్వాత యాక్ట్ లు వేరని అల్లు అరవింద్ చెప్పిన దాంట్లో బొక్కలు ఉన్నాయో ఏమో గానీ, ప్రస్తుతం పైరసీ మాట ఎవరూ ఎత్తడం లేదు.