Geetha Govindam Teaserలిప్ లాక్, హాట్ సీన్స్, బోల్డ్ డైలాగ్స్ తో “అర్జున్ రెడ్డి” సినిమాను రక్తి కట్టించిన విజయ్ దేవరకొండ, డీసెంట్ గా మారిపోయాడంట! ఈ విషయం ఎవరు చెప్పారో తెలుసా..? స్వయంగా విజయ్ నే “గీత గోవిందం” సినిమా టీజర్ లో స్పష్టం చేసాడు. గీతా ఆర్ట్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా తొలి టీజర్ విడుదల కాగా, విజయ్ దేవరకొండ స్టైల్ లో ఈ టీజర్ విశేషంగా అలరిస్తోంది.

బ్లాక్ అండ్ వైట్ వీడియో నుండి కలర్ ఫుల్ వీడియోకు వచ్చిన ఈ టీజర్ లో హీరోయిన్ బెదిరింపులు…. హీరో హావభావాలు…. ఈ టీజర్ ను డీసెంట్ గా మార్చేసాయి. ఫుల్ ఎంటర్ టైనింగ్ గా సాగిన ఈ టీజర్ లో గోపి సుందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం జోష్ ఫుల్ గా ఉంది. ‘సోలో’ ఫేం పరాసురం దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఆడియో ఈ నెల 29వ తేదీన విడుదల అవుతోంది.