Geetha Govindam Movie Box office Collections‘ఎ టు జెడ్’ అన్ని సెంటర్ లలో కలెక్షన్ల దుమ్ము దులుపుతోన్న “గీత గోవిందం”కు ఈ శనివారం కీలక రోజు కానుంది. తొలి మూడు రోజులు అంచనాలకు మించిన కలెక్షన్స్ ను అందుకోవడంతో, “అర్జున్ రెడ్డి” లైఫ్ టైం కలెక్షన్స్ ను అవలీలగా దాటేయనుందన్న విషయం ఖరారయ్యింది. అయితే అది ఈ వీకెండ్ లోనే సాధ్యమయ్యే అవకాశం ఉందా? అనే అంశం ఈ శనివారం నాడు సాధించబోయే కలెక్షన్స్ పై ఆధారపడి ఉంది.

ఏపీ, తెలంగాణాలలో పరిస్థితి ఇలా ఉంటే, యుఎస్ లోనూ ఈ శనివారం ‘గీత గోవిందం’కు అత్యంత ప్రధానమైన రోజు. తొలి మూడు రోజుల్లో దాదాపుగా 1 మిలియన్ కు చేరువైన ఈ సినిమా, శనివారం నాటి కలెక్షన్స్ అఫీషియల్ గా దానిని డిక్లేర్ చేయనుంది. అలాగే 2 మిలియన్ సాధ్యాసాధ్యాలను కూడా నేటి కలెక్షన్స్ డిసైడ్ చేయనుంది. 1.5 మిలియన్ అన్నది కేక్ వాక్ కాగా, ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే 2 మిలియన్ కూడా అసాధ్యమేమీ అనిపించడం లేదు.

‘అర్జున్ రెడ్డి’ కూడా 2 మిలియన్ మార్క్ ను సొంతం చేసుకోగా, ఈ ‘గీత గోవిందం’ ఆ ఫీట్ ను అందుకుంటే పలువురు అగ్ర హీరోలు కూడా అందుకోలేని మార్క్ ను హీరోగా విజయ్ దేవరకొండ సాధించినట్లవుతుంది. సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోన్న విజయ్ దేవరకొండ మాత్రం, “ప్రస్తుతం అన్నీ వర్కౌట్ అవుతున్నాయి, బాగానే ఉంది” అంటూ సక్సెస్ ను నెత్తికెక్కించుకోకుండా మాట్లాడుతుండడం ఆహ్వానించదగ్గ అంశం.