Geetha Govindam- Lip-Lock Scene Trimmed for Familiesవిజయ్ దేవరకొండ “గీత గోవిందం” సినిమాకు పాజిటివ్ టాక్ లభించడంతో చిత్ర యూనిట్ అంతా ఫుల్ ఖుషీలో ఉంది. ముఖ్యంగా ఈ సినిమా విడుదలకు కొన్ని సన్నివేశాలు లీక్ కావడంతో, సినిమా యూనిట్ అంతా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు వచ్చిన అపూర్వమైన స్పందనకు ఇప్పుడు ఆ కోపమంతా చల్లారిపోయుంటుందని చెప్పవచ్చు.

రికార్డ్ ఓపెనింగ్స్ తో మోత మోగించిన “గీత గోవిందం” నుండి ముందుగా లీక్ అయిన లిప్ లాక్ సన్నివేశాన్ని చిత్ర యూనిట్ బాగా ట్రిమ్ అయినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. క్లైమాక్స్ షాట్ లో రష్మిక-విజయ్ ల మధ్య బస్సులో చిత్రీకరించిన ఈ లిప్ లాక్ సన్నివేశం ముందుగా లీకై అందరూ చూసేసారని అనుకున్నారో ఏమో గానీ, తెరపై బాగా షార్ట్ చేసారనే టాక్ ఊపందుకుంది.

బహుశా ముందుగా లీక్ చేసినందుకు ప్రేక్షకులపై రివేంజ్ తీర్చుకునే విధంగా ఈ షాట్ ను ట్రిమ్ చేసారో లేక ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని కట్ చేసారో లేక సెన్సార్ బోర్డు నిబంధనలతో లేపెసారో గానీ, సోషల్ మీడియాలో ఈ లిప్ లాక్ సన్నివేశం గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. అయినా సినిమా అంతా నడిచేది ఒక్క లిప్ లాక్ సన్నివేశం గురించే కదా!