Geetha-Govindam-US-Collections-Vijay-Deverakonda-on-The-Track-Expectedసినీ వారసత్వ బ్యాక్ గ్రౌండ్ లేనటువంటి విజయ్ దేవరకొండ వంటి ఒక సాధారణ హీరో నటించిన సినిమా 100 కోట్లు గ్రాస్ వసూలు చేయడం సాధ్యమేనా? అంటే ‘ఖచ్చితంగా’ అనే నమ్మకాన్ని “గీత గోవిందం” అందించింది. తొలి వారం కూడా ముగియక ముందే 50 కోట్ల గ్రాస్ వసూలు చేయడం అనేది రిలీజ్ కు ముందు ఊహించినది కాదు, కానీ అది అవలీలగా సాధ్యమైంది.

బహుశా ఇదే ఓ స్టార్ హీరో సాధించినట్లయితే, ఈ మూవీతోనే 100 కోట్ల క్లబ్ లో సదరు హీరో చేరతాడని పేర్కొనవచ్చు. అయితే ఈ సినిమా ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, పొరుగు రాష్ట్రంలో కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ప్రదర్శితమవుతుండడంతో, ‘గీత గోవిందం’ కూడా 100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశాలు లేకపోలేదు, కానీ కాస్త కష్టసాధ్యమే అని చెప్పాలి.

100 కోట్ల క్లబ్ లో చేరాలంటే మరో 45 కోట్లు పైగా ‘గీత గోవిందం’ కొల్లగోట్టాల్సి ఉంది. యుఎస్ మార్కెట్ లో మహా అయితే మరో హాఫ్ మిలియన్ పైగా వసూళ్లు ఉండవచ్చు. మిగిలినదంతా స్థానికంగా వసూలు చేయాల్సిందే. ఆగష్టు 31వ తేదీ వరకు ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే సినిమాలు కూడా ఏమీ లేవు గనుక, సంచలనాలు నమోదైనా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు అంటున్నారు ట్రేడ్ పండితులు.

ఒకవేళ “గీత గోవిందం” 100 కోట్లు కొల్లగొట్టినా, లేకున్నా భవిష్యత్తులో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం ఆ మార్క్ ను ఖచ్చితంగా అందుకుని తీరుతుందన్న విశ్వాసం మార్కెట్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు రాబడుతుండడం… విజయ్ దేవరకొండను టాలీవుడ్ లో హాట్ ప్రాపర్టీగా మార్చేసింది.