Geetha - Govindam -Advance Bookingsపైరసీ బారిన పడి హీరో విజయ్ దేవరకొండతో పాటు మొత్తం చిత్ర యూనిట్ సభ్యులను డీలా పడేలా చేసిన “గీత గోవిందం” సినిమా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ సాధించే అవకాశముందని ముందస్తు బుకింగ్స్ చెప్తున్నాయి. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా అగ్ర హీరోల సినిమాల మాదిరి మల్టీప్లెక్స్ లన్నీ హౌస్ ఫుల్స్ తో కళకళలాడుతున్నాయి. దీంతో రికార్డ్ ఫస్ట్ డే అన్నది దాదాపుగా ఖరారైన అంశం.

ఆన్ లైన్ బుకింగ్స్ లో అద్భుతమైన ఓపెనింగ్స్ తో సంచలనంగా మారిన “గీత గోవిందం” ఫస్ట్ డే టాక్ గనుక పాజిటివ్ గా వెలువడితే, హీరో విజయ్ దేవరకొండ కెరీర్ లోనే కాదు, ఈ ఏడాది టాలీవుడ్ టాప్ 5 బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ లో ఒకటిగా నిలిచే సంకేతాలు కనపడుతున్నాయి. పైరసీతో కుదేలైన విజయ్ దేవరకొండకు, ఈ అడ్వాన్సు బుకింగ్స్ ఫుల్ జోష్ నిస్తాయని చెప్పడంలో సందేహం లేదు.

ఇండియాలో పరిస్థితి ఇలా ఉంటే, యుఎస్ లోనూ ఈ సినిమా పట్ల విపరీతమైన బజ్ ఉంది. దీంతో ప్రీమియర్స్ తో పాటు ఫస్ట్ డే ఎంత కొల్లగోడుతుందోనన్న ఆసక్తి ట్రేడ్ వర్గాలలో నెలకొంది. ‘అర్జున్ రెడ్డి’ యుఎస్ లో కూడా భారీ విజయం సాధించగా, దానిని ‘గీత గోవిందం’ దాటుతుందో లేదో వేచిచూడాలి. సినిమాపై కావల్సినంత బజ్ ఉండడంతో ఓపెనింగ్స్ కు డోకా ఉండకపోవచ్చు, ఆ పైన ‘టాక్’పై ఆధారపడుతుంది.