gautamiputra-satakarni-trailer-talk-december-16అత్యంత భారీ హంగులతో క్రిష్ దర్శకత్వంలో సిద్ధమవుతోన్న నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న 100వ సినిమా “గౌతమీపుత్ర శాతకర్ణి” ట్రైలర్ ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో మెగాస్టార్ చిరంజీవి “ఖైదీ నంబర్ 150”తో పోటీ పడుతున్న ఈ సినిమా కమర్షియల్ స్టామినా ఏ రేంజ్ వరకు ఉందో అన్న విషయాన్ని ధియేటిరికల్ ట్రైలరే నిర్దేశిస్తుంది.

మరి ఈ ట్రైలర్ ఎప్పుడు రానుంది? ఎప్పుడు ఈ టాక్ వినపడుతుంది… అన్నది తెలుసుకోవాలంటే డిసెంబర్ 9వ తేదీ వరకు వేచిచూడాల్సిందే. ఎందుకంటే ఆ రోజునే “గౌతమీపుత్ర శాతకర్ణి” సినిమా ధియేటిరికల్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయబోతుందని లభించిన కీలక సమాచారం. ఈ సినిమా ఆడియో విడుదల కంటే ముందుగానే ట్రైలర్ ను విడుదల చేసి అభిమానుల్లో నూతన ఉత్సాహం నింపే ప్రక్రియకు చిత్ర యూనిట్ శ్రీకారం చుట్టినట్లుగా కనపడుతోంది.

ఈ సినిమా ఆడియోను డిసెంబర్ 16వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న తరుణంలో… ఆడియో కంటే ఒక వారం ముందుగానే ట్రైలర్ విడుదల చేయనుండడం అనేది… సినిమాపై చిత్ర యూనిట్ కు అంత నమ్మకం ఉందా? అనే ప్రశ్నను రేకెత్తిస్తోంది. ఎవరికీ తెలియని చరిత్ర కావడంతో, ఈ సినిమా కధపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను అందుకుంటే టాప్ దర్శకుల జాబితాలోకి క్రిష్ చేరుకోవడం ఖాయమనేది సినీ విశ్లేషకుల మాట.