gautamiputra-satakarni-title-songటాలీవుడ్ లో ప్రతిష్టాత్మక సినిమాలకు లీక్ లనేవి సర్వసాధారణంగా మారిపోయాయి. గతంలో ఎంతో పకడ్బందీగా తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమా కూడా లీక్ ల నుండి తప్పించుకోలేకపోయింది. తాజాగా టాలీవుడ్ లో అంతే ప్రతిష్టాత్మకంగా నందమూరి నటసింహం 100వ సినిమా “గౌతమీపుత్ర శాతకర్ణి” తెరకెక్కుతోంది. చారిత్రాత్మక కధాంశంతో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ సాంగ్ ప్రస్తుతం వెబ్ ప్రపంచంలో హల్చల్ చేస్తోంది.

దాదాపుగా 3 నిముషాల పాటు సాగిన ఈ పాట శ్లోకాలతో ప్రారంభమై అద్భుతంగా సాగింది. ఇటీవల మధ్యప్రదేశ్ లో ఓ కోటలో జరిగిన ‘రాజసూయ యాగం’పై చిత్రీకరించిన పాటగా తెలుస్తోంది. ఈ సినిమాపై ఉన్న అంచనాలను ఖచ్చితంగా రెట్టింపు చేసే విధంగానే ఈ పాట ఉండడంతో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా పాట అప్పుడే ఎలా లీక్ అయ్యిందనేది మాత్రం అంతుపట్టని విషయం.