gautamiputra-satakarni-poster-1క్రిష్ దర్శకత్వం వహిస్తున్న “గౌతమీపుత్ర శాతకర్ణి”లో నందమూరి నటసింహం బాలకృష్ణ ఎలా ఉంటాడో అన్న ఆసక్తికి సమాధానం దొరికింది. 100వ సినిమా కావడంతో అభిమానుల అంచనాలు తారాస్థాయిలో ఉన్న నేపధ్యంలో… దసరా సందర్భంగా బాలయ్య బాబు ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. నందమూరి అభిమానులు ఆశించిన రేంజ్ లో లేకపోయినా… పర్వాలేదనిపించే విధంగా ఉంది ఈ పోస్టర్.

బాలయ్య రూపం, ఆహార్యం ఆకట్టుకునే విధంగా ఉన్నప్పటికీ, ధరించిన విగ్ మాత్రం వీక్షించడానికి కాస్త ఇబ్బందికరంగా మారింది. అయితే సిల్వర్ స్క్రీన్ పైన ఎలా ఉంటారో ఇప్పుడే అంచనాలు వేయడం కష్టంగానీ, దీనికి శాంపిల్ గా దసరా పండుగ నాడు ఉదయం 10.15 నిముషాలకు తొలి టీజర్ ను విడుదల చేస్తున్నారు. ప్రేక్షకులను ఈ టీజర్ ఎంతమేరకు ఆకట్టుకుంటుందో, ఆ స్థాయిలోనే ఈ సినిమాపై అంచనాలు ఏర్పడతాయని చెప్పవచ్చు.