gautamiputra-satakarni-movie-teaserపెద్ద సినిమాలకు లీక్ లు సర్వసాధారణంగా మారిపోయిన తరుణంలో… తాజాగా ఆ బాటలో “గౌతమీపుత్ర శాతకర్ణి” సినిమా టీజర్ నిలిచింది. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ సాంగ్ లీక్ బారిన పడి సోషల్ మీడియాలో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన 30 సెకన్ల టీజర్ నెట్టింట సందడి చేస్తోంది. యుద్ధ సన్నివేశాలతో, బాలకృష్ణ డైలాగ్స్ తో కూడిన ఈ టీజర్ 11వ తేదీన విజయదశమి పురస్కరించుకుని అధికారికంగా విడుదల కానుంది.

అయితే, అంతకుముందే మొబైల్ ఫోన్స్ లో సందడి చేయడం పబ్లిసిటీలో భాగమేనా? అవునులేండి… ప్రస్తుతం లీక్ చేయడం కూడా ఒక రకమైన పబ్లిసిటీనే కదా! ఇది ఒక్క ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విషయంలోనే కాదు, ప్రతి పెద్ద సినిమా దారిలో పయనిస్తున్న విషయం నెటిజన్లకు తెలిసినదే. ఇంతకీ… లీకైన టీజర్ ఎలా ఉంది అంటారా? తినబోతు రుచిచూడడం దేనికి? మరికొద్ది గంటలు వేచిచూస్తే… హెచ్.డీ క్వాలిటీలో బాలయ్య రూపం దర్శనమిస్తుంది కదా..!