bala-krishna-krish-movie-look-leakక్రిష్ దర్శకత్వంలో నందమూరి నటసింహం నటిస్తున్న “గౌతమీపుత్ర శాతకర్ణి” సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవల సోషల్ మీడియాలో లీక్ అయిన ఫోటోలు, టైటిల్ సాంగ్ విపరీతంగా ఆకట్టుకోవడంతో ఫ్రీ పబ్లిసిటీ లభించినట్లయ్యింది. అందులో భాగంగానే తాజాగా మరో పిక్ హల్చల్ చేస్తోంది. ఏనుగుపై బాలకృష్ణ ఓ పిల్లాడుతో కూర్చున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే ఇలా లీక్ అయిన ఫోటోల ద్వారా కాదు, నేరుగా అఫిషియల్ ఫోటోలతో ఫ్యాన్స్ కు కిక్ ఇస్తానంటున్నాడు బాలయ్య.

దసరా పండగను పురస్కరించుకుని అక్టోబర్ 9వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన బాలకృష్ణ రాయల్ ఫస్ట్ లుక్ ను విడుదల చేయనుండగా, ఫస్ట్ టీజర్ ను అక్టోబర్ 11వ తేదీన ఉదయం 8 గంటలకు విడుదల చేయబోతున్నారని సమాచారం. రాజుగా బాలకృష్ణ లుక్ గురించి సందేహించాల్సింది ఏమీ లేదు గానీ, ఒక వారియర్ గా ఏ మేరకు ఆకట్టుకున్నాడో అన్నది మిక్కిలి ఆసక్తికరంగా మారింది. దీంతో నందమూరి నటసింహం టీజర్ కోసం అభిమానులతో పాటు సినీ ప్రేక్షకగణం కూడా ఎదురుచూస్తోంది. బాలయ్యకు జోడిగా అందాల బొమ్మ శ్రియా శేరన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.