Gautamiputra Satakarni Shiva Rajkumar Royal Lookనందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతోన్న “గౌతమీపుత్ర శాతకర్ణి” ఆడియో విడుదలకు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 16వ తేదీన తిరుపతిలో ఈ సినిమా పాటలను అంగరంగ వైభవంగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. మరో పక్కన సినిమాలోని క్యారెక్టర్లను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ… ఎప్పటికప్పుడు పోస్టర్లను విడుదల చేస్తోంది.

ఆ క్రమంలోనే కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తనయుడు శివరాజ్ కుమార్ పాత్ర ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. శివరాజ్ కుమార్ తల్లి పార్వతమ్మ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్ లో శివరాజ్ లుక్ వీక్షకులను ఆకట్టుకుంటోంది. తెలుగు తెరపై తొలిసారిగా కనిపించబోతున్న శివరాజ్, కన్నడ నాట ఓ ‘సూపర్ స్టార్’ అన్న విషయం తెలిసిందే.