Gautamiputra Satakarni latest Youtube Recordsసంక్రాంతి పండగ సందర్భంగా విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న “గౌతమీపుత్ర శాతకర్ణి” సినిమా, బాక్సాఫీస్ వద్ద కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు తొలి 5 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 40 కోట్ల షేర్ ను దాటి, బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా అవతరించిందని తెలుస్తోంది. మొత్తమ్మీద 60-70 కోట్ల క్లబ్ లో ‘శాతకర్ణి’ నిలుస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే, అసలు ఈ సినిమాపై ఈ రేంజ్ లో అంచనాలు పెరగడానికి కారణమైన అంశం… ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ధియేటిరికల్ ట్రైలర్ అన్న విషయం తెలిసిందే. ట్రైలర్ విడుదలైన నాటి నుండి ఈ సినిమాపై నమ్మకాలు ఏర్పడ్డాయి. అందుకే నెటిజన్లు ఈ ట్రైలర్ కు పట్టాభిషేకం చేస్తూ… అరుదైన రికార్డులను సొంతం చేసిన విషయం కూడా విదితమే. తాజాగా ఈ ట్రైలర్ మరో అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకుంది.

తెలుగు సినిమాలకు సంబంధించినంత వరకు యూ ట్యూబ్ లో ‘ఒక లక్ష లైక్స్’ అందుకున్న తొలి ట్రైలర్ గా చరిత్ర సృష్టించింది. తెలుగు వాడి సత్తాను యూ ట్యూబ్ నుండే ప్రేక్షకులు తెలపడం ప్రారంభించారు అనే దానికి నిదర్శనంగా ఈ ట్రైలర్ నిలుస్తోంది. అలాగే ఇప్పటివరకు ఈ ట్రైలర్ 7 మిలియన్ క్లిక్స్ అందుకుంది. బహుశా సినిమా విడుదలైన తర్వాత ఈ ట్రైలర్ కు మరింత స్పందన వచ్చినట్లుగా కనపడుతోంది.