gautamiputra-satakarni-balakrishna-royal-still“గౌతమీపుత్ర శాతకర్ణి”లో ఇప్పటివరకు విడుదలైన పలు ఫోటోలను బట్టి బాలయ్య బాబు ఓ రెండు, మూడు గెటప్ లలో కనిపించబోతున్నారన్న విషయం ఖరారైంది. ఆ క్రమంలోనే రాజుగా కనిపిస్తున్న బాలయ్య తాజా స్టిల్ అభిమానులను విపరీతంగా అలరిస్తోంది. రాయల్ లుక్ లో నందమూరి నటసింహంకు ఎదురులేదంటూ… సదరు ఫోటోను తిలకిస్తూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే… ఈ నెల డిసెంబర్ 9వ తేదీన “గౌతమీపుత్ర శాతకర్ణి” ధియేటిరికల్ ట్రైలర్ విడుదల కానుండడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు పోస్టర్ల ద్వారా ఉత్సాహం నింపిన అభిమానులకు, పోరాటయోధుడిగా బాలయ్య ఉగ్రరూపం దర్శనమివ్వబోతుందన్న సంకేతాలు వస్తున్నాయి. సినిమాలో ఉన్న నాలుగు యుద్ధ సన్నివేశాలు హైలైట్స్ నిలిచాయన్న విషయం ఇప్పటికే లీక్ కావడంతో, ట్రైలర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ట్రైలర్ తో మొదలైన ప్రచారం, సినిమా విడుదల వరకు ప్రతి వారం నిరంతరాయంగా సాగే విధంగా చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంది. మరుసటి వారంలో డిసెంబర్ 16వ తేదీన ఆడియో వేడుక ఉండగా, ఆపై వారం మేకింగ్ వీడియోలు, ఆ తర్వాత కొత్త సంవత్సరం కానుకగా టీజర్లు… ప్రీ రిలీజ్ వేడుకలు… ఇలా సంక్రాంతి సమయం నాటికి ప్రేక్షకులకు, అభిమానులకు ఇంటర్వెల్ లేకుండా అదిరిపోయే ప్లానింగ్ సిద్ధమైనట్లుగా ట్రేడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతానికి మాత్రం ఇలా అరిపించే పోస్టర్లే!