gautami-about-her-relation-with-kamal-haasan“కమల్ హాసన్ తో కలిసి ఉండడాన్ని సహజీవనం అని పిలిచినా లేక ప్రేమలో ఉన్నామని అన్నా అదీ కాక భార్యాభర్తల బంధం అని తెలిపినా… ఇలా ట్యాగ్ ఏదైనా గానీ తమకు ఇబ్బంది లేదని, తాము ఎంత ఆనందంగా ఉన్నామన్నదే ప్రధానమని” ప్రముఖ సినీ నటి గౌతమి తన అనుభూతులను పంచుకున్నారు. “కాలమాన పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులను బట్టి సమాజంలో కట్టుబాట్లు మారుతున్నాయని, పలు సందర్భాల్లో అవి సవరణకు గురవుతున్నాయని, వాటి ప్రధాన లక్ష్యం ఏంటంటే జీవితాన్ని మరింత ఆనందంగా ఉండడమని, ఇప్పుడు తాను సంతోషంగా ఉన్నానని” తెలిపారు.

“కేన్సర్ బారినపడి తీవ్ర మానసిక ఒత్తిడితో మరింత కుంగిపోయేవారితో పోలిస్తే… తాను చాలా అద్భుతమైన స్థితిలో ఉన్నానని, తన చుట్టూ తనను కంటికి రెప్పలా చూసుకునే వారు, తన సంక్షేమం కోరుకునే వారు ఉన్నారని, అదే సగం మానసిక ధైర్యాన్ని ఇస్తుందని” అన్నారు. ఉమెన్స్ డే అంటే కేవలం ఉద్యోగులు చేసుకునేది కాదని, ఉద్యోగులు, నిపుణుల కంటే ఇంటి బాధ్యతలు నిర్వర్తించడం కష్టమని, వాటిని సక్రమంగా నిర్వర్తించడం కత్తి మీద సామేనని గౌతమి పేర్కొన్నారు.