Gautam-Krishna-Ghattamaneni-at-IPL-Cricket-Matchఇండియన్ ప్రీమియర్ లీగ్ హంగామా మొదలైందంటే, అందులో హంగామా చేసే తెలుగు సెలబ్రిటీలలో విక్టరీ వెంకటేష్ మొదటి స్థానంలో నిలిస్తే, ప్రిన్స్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ రెండవ స్థానంలో నిలుస్తాడు. సహజంగా వెంకీ పక్కనే గౌతమ్ కూడా దర్శనమిస్తుంటాడు. అయితే హైదరాబాద్ లో జరిగిన తొలి మ్యాచ్ లో వెంకటేష్ కనిపించారు గానీ, ప్రిన్స్ తనయుడు రాకపోవడంతో, ఈ సారి ఐపీఎల్ కు దూరంగా ఉంచారేమో అన్న భావన కలిగింది.

కానీ, ఆదివారం నాడు జరిగిన సన్ రైజర్స్ – గుజరాత్ లయన్స్ మధ్య మ్యాచ్ కు గౌతమ్ కూడా హాజరై, మ్యాచ్ ఆద్యంతం ఎంజాయ్ చేసాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మద్దతు తెలుపుతూ టీ షర్టు ధరించాడు జూనియర్ ప్రిన్స్. సహజంగా సెలబ్రిటీల వారసులను ఇలాంటి బహిరంగ వేడుకలకు దూరంగా ఉంచుతారు. కానీ ఇలాంటి ఎంజాయ్ మెంట్ లకు మాత్రం ప్రిన్స్ ఫ్యామిలీ ఎప్పుడూ అడ్డు చెప్పకపోవడం విశేషం.