ఇండియన్ క్రికెటర్, కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ దంపతులకు పండంటి పాప జన్మించింది. ఇప్పటికే గంభీర్ కు ఆజీన్ అనే కూతురు ఉండగా, తాజాగా రెండో సంతానం కలిగింది. ఈ సందర్భంగా గంభీర్ తన సంతోషాన్ని అభిమానులతో ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు.
“మమ్మల్ని దీవించేందుకు మా కుటుంబంలోకి మరో యువరాణి అడుగుపెట్టింది. ఆమె రాకతో మా జీవితంలో వెలుగులు నిండాయి. యువరాణికి స్వాగతం”, అంటూ గంభీర్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. అంతేకాదు తన పెద్ద కుమార్తె ఒడిలో పడుకున్న చిన్నారి ఫొటోను అప్ లోడ్ చేశాడు.
2011లో నటాషాతో గంభీర్ వివాహం జరిగింది. ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ కోహ్లీ, ఇర్ఫాన్ పఠాన్ తో సహా ఇతర క్రీడాకారులు గంభీర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పాప రాకతో, టీమిండియాలోకి మళ్ళీ గంభీర్ రంగ ప్రవేశం చేస్తాడేమో చూడాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైనా జరగొచ్చు అనే విధంగా ఉంది.