Ganta Srinivasa Raoమాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చాలా రోజుల తర్వాత శుక్రవారం చంద్రబాబు నాయుడుకి మద్దతు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. అనపర్తిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గర్హనీయం. ప్రతిపక్ష నాయకుడి పర్యటనను అడ్డుకొనే స్థాయికి దిగజారడం అంటే నైతికంగా దిగజారదమే. నియంతృత్వం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ప్రతీసారి రుజువైంది. టిడిపి హాయంలో జరిగిన రాజశేఖర్ రెడ్డిగారి పాదయాత్రకు కానీ, జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రను గానీ ఎక్కడైనా పోలీసులు అడ్డుకున్నారా?లైట్లు ఆపేసి, మైక్స్ లాక్కుని ఇబ్బందులకు గురి చేయడం సబబు కాదు. ఇది ఏ మాత్రం సహించరానిది. పెను ఉద్యమానికి దారితీసేలా వ్యవహరించవద్దని ప్రభుత్వ పెద్దలకు సూచిస్తున్నాను,” అని గంటా శ్రీనివాస రావు ట్వీట్‌ చేశారు.

టిడిపి అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవి పొందిన గంటా శ్రీనివాసరావు, గత ఎన్నికలలో టిడిపి ఓడిపోగానే వైసీపీలో చేరిపోయేందుకు ప్రయత్నించారని కానీ స్థానిక వైసీపీ నేతలు అడ్డుపడటంతో చేరలేకపోయారని వార్తలు వచ్చాయి. వైసీపీలో చేరలేకపోయినా తన కాంట్రాక్టులు, వ్యాపారాలకి వైసీపీ ప్రభుత్వం వలన ఇబ్బందులు కలుగకూడదని ఇంతకాలం టిడిపికి దూరంగా ఉండిపోయారు. అందుకే పార్టీలో సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు, “ఈ గంటా ఎవడండి… ప్రతీసారి పార్టీ, సీట్లు మార్చుకొనే వ్యక్తి మనకెందుకు?” అంటూ బహిరంగంగానే విమర్శించారు. కానీ గంటా శ్రీనివాసరావు బదులివ్వలేదు. ఇస్తే తనకే మరింత అప్రదిష్ట అని మౌనం వహించిన్నట్లున్నారు.

నెలరోజుల క్రితం నారా లోకేష్‌ని కలిసి మళ్ళీ పార్టీలోనే కొనసాగాలనుకొంటున్నట్లు చెప్పక యువగళం పాదయాత్ర విజయవంతం అవుతుందని ట్వీట్‌ చేశారు. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత చంద్రబాబు నాయుడుకి సంఘీభావం ప్రకటిస్తూ ట్వీట్‌ చేశారు. ట్వీట్‌ చేయడానికి కూడా ఇంతగా ఆలోచించే గంటా వంటి రాజకీయ నాయకుడు టిడిపికి అవసరమా? అయ్యన్నపాత్రుడిని అడిగితే చెపుతారు.