Ganta Srinivasa Rao comments on Visakhapatnam Steel privatisationమాజీ మంత్రి గంట శ్రీనివాసరావు హైదరాబాద్ వెళ్లి తెలంగాణ మంత్రి కేటీఆర్ ని కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటానికి విశాఖ వచ్చి మద్దతు ఇవ్వాల్సింది గా కోరారు. అందుకు కేటీఆర్ కూడా సానుకూలంగా స్పందించారు. అసెంబ్లీ సమావేశాల తరువాత సీఎం కేసీఆర్ తో చర్చించి..తెరాస పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు, పార్లమెంట్ సబ్యులు మరియు మంత్రులతో కలసి వచ్చి ఉద్యమంలో పాల్గొంటామని కేటీఆర్ గంటకు హామీ ఇచ్చారట.

రాజకీయాలలో 2019 తరువాత గంట స్తబ్దుగా మారిపోయారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం అనేది గంట రాజీకీయ అస్తిత్వ పోరాటం అనే చెప్పుకోవాలి. అయితే గంట కు ఉన్న హిస్టరీ… కొన్ని ఆయన అనుమాస్పద అడుగులు కారణంగా చంద్రబాబు నాయుడు ఆయన్ని నమ్మడం లేదు. ముఖ్యమంత్రి జగన్ కు ఆయన అవసరం లేదు.

పైగా వైఎస్సార్ కాంగ్రెస్ గంట మీద చాలా విమర్శలే చేసింది. ఇప్పుడు పార్టీలోకి తీసుకుంటే ఇబ్బందే. మరోవైపు… పవన్ కళ్యాణ్ గతంలో ప్రజారాజ్యం విషయంలో గంట మీద కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. దానితో ఆయనను పార్టీలోకి తీసుకునే అవకాశం లేదు. ఇక బీజేపీ విషయానికి వస్తే.. స్టీల్ ప్లాంట్ పోరాటం అంటే బీజేపీ పై పోరాటమే.

దీనిబట్టి ప్రస్తుతానికి గంట రాజకీయ ప్రస్థానం ఎటు కాకుండా ఉందనే చెప్పుకోవాలి. 2024 వరకు బహుశా ఏదోలా వార్తలలో ఉండి ఎన్నికల హడావిడి సమయంలోనే ఆయన తన నెక్స్ట్ స్టెప్ పై ఆలోచన చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి మాత్రం గంట ఆరాటమే తప్ప వ్యవహారం ముందుకు వెళ్లడం లేదు