Ganta-Srinivasa-Rao-Responds-Pawan-Kalyan-Demandsప్రముఖ దర్శకుడు జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు రవితేజను “జయదేవ్” చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేసిన విషయం తెలిసిందే. ‘వన్ మూవీ వండర్’ హీరోగా మారిన రవితేజతో మరో సినిమా చేసేందుకు ఏ నిర్మాత, దర్శకుడు ముందుకు రాకపోవడం విశేషం. సినిమాలు లేకున్నా, తాజాగా సోషల్ మీడియాలో మాత్రం రవితేజకు సంబంధించి ఓ అంశం వైరల్ అవుతుండగా, దీనిపై మంత్రి గారే స్వయంగా స్పష్టత ఇచ్చారు.

ఇంతకీ వైరల్ అవుతున్న విషయం ఏమిటంటారా… ‘ఫిదా’ మూవీతో ప్రేక్షకుల మనసు కొల్లగొట్టిన ముద్దుగుమ్మ సాయిపల్లవితో, గంటా శ్రీనివాసరావు తనయుడు రవితేజకు నడుమ ప్రేమాయణం నడుస్తోందట! దీంతో ఈ పుకార్లను ఖండించేందుకు స్వయంగా మంత్రి గారే రంగంలోకి దిగారు. సహజంగా తాను ఇలాంటి అంశాలపై స్పందించనని చెప్పిన గంటా, ఇద్దరు జీవితాలలో మచ్చ పడే అవకాశం ఉంది గనుక చెప్తున్నానని, ఇవన్నీ ఒట్టి పుకార్లేనని, తన తనయుడికి వివాహం కూడా జరిగిందని, ఇలాంటివి ప్రచారం చేయవద్దంటూ కోరారు.