ganta-srinivasa-rao-negotiating-for-cabinet-post-in-ysrcpమాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ మార్పు ఖాయంగా కనిపిస్తుంది. పార్టీ మార్పుకు ముహూర్తం 16వ తేదీని ఫిక్స్ చేశారు. అదే రోజు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గంటాతో పాటు పలువురు టీడీపీ మాజీ నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు సమాచారం.

విశాఖపట్నంలో వినిపిస్తున్న మరి కొన్ని వదంతులను బట్టి గంటా జగన్ కేబినెట్ లో చోటు ఆశిస్తున్నారట. తెలుగుదేశం పార్టీ నుండి తనతో పాటు కనీసం ఆరుగురు ఎమ్మెల్యేలను తీసుకుని రావడానికి తనకు మంత్రివర్గంలో చోటు, వచ్చే జీవీఎంసీ ఎన్నికలలో తాను చెప్పిన వారికి మేయర్ సీటు గంటా ఆశిస్తున్నారట.

ఒకవేళ గంటా తో కలిపి ఏడుగురు ఎమ్మెల్యేలు వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వచ్చినట్టు అయితే అసెంబ్లీలో చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా పోతుంది. దీనితో గంటా ప్రపోజల్ కు ముఖ్యమంత్రి జగన్ సానుకూలంగానే ఉన్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మొదట్లో టీడీపీ నుంచి తన రాజకీయ భవిశ్యత్ ను ప్రారంభించిన ఆయన ఆ తరువాత 2009 లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు.

ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం అయిన తరువాత కాంగ్రెస్ లో చేరి మంత్రి అయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం తిరిగి టీడీపీలో చేరి భీమిలి నుంచి పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. 2014 నుంచి 19 వరకూ విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2019 లో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్యే అయ్యారు. అయితే గత కొంతకాలంగా టీడీపీ నాయకత్వంతో అంటీముట్టనట్టుగా గంటా వ్యవహరిస్తున్నారు