Ganta Srinivasa Rao joining ysrcpతెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుని అధికార పార్టీ బానే దారికి తెచ్చుకున్నట్టుగా ఉంది. అనేక కేసులు, స్కామ్ల పేరుతో అదిరించి, బెదిరించి గంటాని చివరికి తమ పార్టీలోకి వచ్చేలా చేసుకున్నారని సమాచారం. ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పి, వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే సీఎం జగన్‌తో సన్నిహితంగా మెలిగే కీలక నేతలతో మంతనాలను కూడా ముగించినట్లు సమాచారం. గంటా చేరికకు సీఎం జగన్ నుంచి క్లియరెన్స్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఆగస్టు 15 న ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని జగన్ ప్రభుత్వం తలపోసింది. ఈ కార్యక్రమం వేదికగానే గంటా వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.

అయితే గంటా చేరిక స్థానిక నేతలైన అవంతి శ్రీనివాస్, విజయసాయి రెడ్డిలకు అర్ధం లేదని, అయితే తొందరలో రాజధాని కాబోతున్న విశాఖపట్నంలో పార్టీని బలోపేతం చెయ్యాలని, అదే సమయంలో టీడీపీని వీలైనంత బలహీనపరిచే భాగంగా సీఎం ఈ నిర్ణయం తప్పదని తేల్చి చెప్పారని వార్తలు వస్తున్నాయి.

వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండీ… టీడీపీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే వైసీపీలో చేరనున్నారన్న ప్రచారం ఊపందుకుంది. అయితే ఎప్పటికప్పుడు గంటా లేదని చెబుతున్నారు. అదే సమయంలో ఆయన మీద అధికార పార్టీ నేతల విమర్శలు కూడా గట్టిగానే ఉంటున్నాయి.