Ganta Srinivasa Rao joining ysr congress partyమొన్న ఆ మధ్య సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో పోస్టు పెట్టినందున నలంద విద్యాసంస్థల అధినేత కిషోర్ ని సిఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆప్త మిత్రుడు కావడంతోనే అదుపులోకి తీసుకుని ఇబ్బందులు పెడుతున్నారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.

తాజాగా తీవ్ర‌మైన గుండెపోటు కార‌ణంగా.. ఇవాళ కిషోర్ మృతిచెందిన‌ట్టు ఆయ‌న కుటుంబ‌స‌భ్యులు చెబుతున్నారు. ప్రభుత్వం దాదాపుగా నెల రోజులుగా ఆయనను పెట్టిన టార్చర్ తట్టుకోలేకే ఆయన మృతి చెందినట్టు టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అయితే అప్పట్లో కిషోర్ అరెస్టును ఖండించిన గంటా ఇప్పటివరకు దానిపై స్పందించలేదు.

గత కొన్ని రోజులుగా గంటా టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరుతున్నారని గట్టిగా వార్తలు వస్తున్న తరుణంలో ఈ మౌనం ప్రాధాన్యత సంతరించుకుంది. “నలంద కిషోర్ గారు .. మన పార్టీ నాయకుడే కాదు .. మీ మిత్రుడు కూడా ఏమి జరిగిందో ఇప్పటికైనా నోరు మెదపండి,” అంటూ టీడీపీ అభిమానులు గంటా మీద ఒత్తిడి పెంచుతున్నారు.

ఒకవేళ ఈ విషయంపై గంటా పెదవి విప్పకపోతే ఆయన పార్టీ మారడం ఖాయం అనే అనుకోవచ్చు. ఎన్నికల ఫలితాలు వచ్చినా నాటి నుండీ గంటా వ్యూహాత్మక మౌనమే పాటిస్తున్నారు. పార్టీ వ్యవహారాలలో ఆంటీ ముట్టనట్టుగానే ఉంటున్నారు. మొత్తానికి ప్రభుత్వం పెడుతున్న ఒత్తిడికి లొంగిపోయారా అనేదాని మీద త్వరలోనే క్లారిటీ వస్తుంది.