Ganta Srinivasa Rao Resigns TDPవిశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెరమీదకు రాగానే తాను రాజీనామా చేస్తున్న అంటూ హడావిడి చేశారు. కనీసం పార్టీ తో సంప్రదించకుండా ఈ నిర్ణయం తీసుకుని… ఆ తరువాత తన ట్విట్టర్ అకౌంట్ లో టీడీపీ ఆనవాళ్లు లేకుండా చేసి వేరే పార్టీలోకి వెళ్తారా అనే అనుమానాలు కలిగించారు.

అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ను వ్యతిరేకించి రాజీనామా చెయ్యడం అంటే బీజేపీని వ్యతిరేకించినట్టే అంటే ఆ ఆప్షన్ లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరతారా అనే అనుమానం అందరిలోనూ కలిగిన తరుణంలో ఆయన సీఎం జగన్ ఈ అంశం పై రాసిన లేఖను పొగడటంతో ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్టు సంకేతాలు ఇచ్చారు.

అయితే ఈ రోజు ఉదయం సాక్షి పేపర్ లో గంటా ను గట్టిగా విమర్శిస్తూ ఒక కథనం వచ్చింది. దానితో వైఎస్సార్ కాంగ్రెస్ కు ఆయన మీద ఇంట్రెస్ట్ లేదా అనే అనుమానం కలగకమానదు. వైఎస్సార్ కాంగ్రెస్ ఆప్షన్ కూడా లేకపోతే గంటా పరిస్థితి ఏంటి? పార్టీ మారడానికి… మారి వెంటనే పెద్ద పదవులు పొందడం గంటాకు ముందు నుండీ ఉన్నదే.

అయితే ఈ సారి మాత్రం ఆయన సరైన డైరెక్షన్ లేకుండా ముందుకు వెళ్తున్నారా? అనే అనుమానాలు అంతటా ఉన్నాయి. ఎన్నికలు అవ్వగానే… ఓటమితో స్తబ్దుగా మారిపోయి పార్టీ మారుతా అన్నట్టు సంకేతాలు ఇవ్వడంతో ప్రజలలో కూడా ఆయన పలుకుబడి పల్చన అయ్యింది. చూడాలి ఒకప్పటి ఈ రాజకీయ మేథావి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది?