Galla Jayadev using Pawan Kalyan for cheap publicityకొద్ది రోజులుగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విపక్షనేత జగన్ మోహన్ రెడ్డిపై విమర్శల జల్లు కురిపిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా తమదైన శైలిలో ఆయన మీద విరుచుకుపడుతున్నారు. గల్లా చీప్ పబ్లిసిటీ కోసం పవన్ కళ్యాణ్ ను వాడుకుంటున్నారు అని ఆరోపిస్తున్నారు.

అయితే చీప్ పబ్లిసిటీ కోసం గల్లా ఆరాటపడటం ఏంటి అని టీడీపీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. “గల్లా కుటుంబం దేశంలోనే అత్యంత సంపన్న కుటుంబాలలో ఒకటి. అమరరాజా బ్యాటరీలు కొన్ని వేల మందికి ఉపాధి కలిపిస్తుంది. రాజకీయంగా కూడా గల్లా కుటుంబం రాష్ట్ర రాజకీయాలలో ప్రముఖమైనది. ఆయనకు పవన్ కళ్యాణ్ ను వాడుకోవాల్సిన కర్మ లేదు,” అని టీడీపీ వారు అంటున్నారు.

మాజీ మంత్రి గల్లా అరుణకుమారి తండ్రి రాజగోపాలనాయుడు ఎక్కువ కాలం రాజకీయాల్లో కొనసాగారు. ఆ తరువాత వారసత్వ రాజకీయాలను అందిపుచ్చుకున్న అరుణకుమారి (జయదేవ్ తల్లి) దాదాపు 30 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో ఉన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రెండుసార్లు మంత్రిగా కొనసాగిన గల్లా అరుణకుమారి 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ తీర్థం పుచ్చుకుని చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అప్పట్లో డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చేతిలో ఓటమి పాలైరు.