Galla -Jayadev -Amaravati Capital of Andhra Pradeshఈమధ్య కేంద్ర ప్రభుత్వం ఇండియా మ్యాప్‌ విడుదల చేస్తే అందులో అన్ని రాష్ట్రాల రాజధానుల పేర్లు ఉన్నా ఏపీ రాజధాని పేరు లేదు. అమరావతి రాజధాని అని చంద్రబాబు ప్రభుత్వం గజెట్ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్లే అలా జరిగిందని టీడీపీపై మంత్రులు ఎదురుదాడి చేశారు. అలాగే లోలోపల సంతోషపడ్డారు కూడా.

కేంద్రం అమరావతిని రాజధానిగా గుర్తించలేదు గనుక సాంకేతిక కారణాలతో రాజధాని మార్పుని ఆపలేరు అనుకుంది ప్రభుత్వం. అయితే ఈ విషయాన్ని లోక్ సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లేవనెత్తడం, కేంద్రం వెంటనే తప్పుని సవరించుకుని, అమరావతి రాజధాని గా ఉన్న సవరించిన మ్యాప్ ని విడుదల చేశారు.

అయితే ఇది దేనికి సంకేతం అని అధికార పార్టీ నేతలు ఆలోచనలో పడ్డారు. అమరావతిని రాజధానిగా గుర్తించలేదు కాబట్టి మ్యాప్ లో అప్పుడు పెట్టలేదు అంటే ఇప్పుడు పెట్టడం అంటే రాజధానిగా గుర్తించినట్టే కదా? అంటే అమరావతిని మారిస్తే కేంద్రం జోక్యం చేసుకుంటుందా? పైగా టీడీపీ ఎంపీ అడగగానే సవరించడం ఏంటి?

టీడీపీ – బీజేపీ మరోసారి దగ్గర అవుతున్నాయా? ఈ పరిణామాలు దేనికి సంకేతం? అంటూ రకరకాల ప్రశ్నలు వారిని వేధిస్తున్నాయి. నిన్న ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడిన బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అమరావతిని మార్చడం అసంభవం అని చెప్పడం విశేషం.