gali-janardhan-reddy-daughter-marriage-no-postpone-notes-bangali-janardhan-reddy-daughter-marriage-no-postpone-notes-banఅంచనాలు వేసినట్లుగానే ఎటువంటి ఆటంకాలు లేకుండా గాలి జనార్ధనరెడ్డి కుమార్తె బ్రాహ్మణి వివాహం అంగరంగ వైభవంగా జరుగుతోంది. అద్భుతమైన సెట్లు, లైటింగ్ తో పెళ్లి మండపం కళకళలాడుతోంది. వీటికి సంబంధించిన విజువల్స్ అన్ని ప్రధాన మీడియాలలోనూ ప్రసారం కావడంతో, వీటిని చూసి ముక్కున వేలేసుకోవడం సామాన్యుడి వంతవుతోంది. అయితే ఇటీవల ప్రధాని మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం… ఈ పెళ్లిపై పడుతుందన్న పుకార్లు షికార్లు చేసాయి. కానీ, అలాంటిదేమీ లేకుండా ఘనంగా సుముహుర్తనికి వధూవరులిద్దరూ సిద్ధమవుతున్నారు.

మరి దేశం మొత్తాన్ని కుదిపేసిన పెద్ద నోట్ల రద్దు గాలి ఇంట పెళ్లిని ఏ మాత్రం ప్రభావితం ఎందుకు చేయలేకపోయింది? అంటే దీనికి సమాధానం లభించింది. దాదాపుగా ఆరు నెలల క్రితమే ఈ పెళ్ళికి సంబంధించిన అన్ని బాధ్యతలనూ ఓ ఇంటర్నేషనల్ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థకు అప్పగించేసినట్లుగా తెలుస్తోంది. అప్పుడే ఇవ్వాల్సిన పైకం సదరు సంస్థకు గాలి అప్పగించేసారని, అందుకే ప్రస్తుతం ఈ పెళ్లికి ఎలాంటి ఆటంకాలు రాలేదని సమాచారం. అయితే ఈ డీల్ ఎంతకు కుదిరింది అన్న విషయం వెలుగు చూడలేదు గానీ, అనాధికారికంగా ఇటీవల హల్చల్ చేసిన టాక్ ప్రకారం దాదాపుగా 500 కోట్లుగా ప్రచారంలో ఉంది.

అదండీ… గాలి గారి పెళ్లి సవ్యంగా జరగడం వెనుక ఉన్న మిస్టరీ..!