gali-janardhan-daughterగాలి జనార్ధన్ రెడ్డి తనయురాలి వివాహం అంగరంగ వైభవంగా జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వెడ్డింగ్ కార్డ్ తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాలి, పెళ్లి కోసం ఏదో మధ్య తరగతి హోదాలో (వారికి అదే మధ్య తరగతి) దాదాపుగా ఒక 500 కోట్లు ఖర్చు చేయనున్నారన్న ప్రచారం ఉంది. అయితే ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయనున్నారన్న టాక్ ఐటీ అధికారుల దాకా వెళ్లిందన్న ప్రచారం జోరందుకుంది.

గాలి ఖర్చు పెడుతున్న సొమ్ము సక్రమంగా సంపాదించిందా? లేక అక్రమమైనదా? అనే కోణంలో ఐటీ శాఖ దృష్టి సారించినట్టు, అప్రమత్తమైన ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్, గాలి ఆస్తులపై మరోసారి దర్యాప్తు చేపట్టే అవకాశం కూడా ఉన్నట్లు మీడియా వర్గాలు కధనాలు ప్రసారం చేస్తున్నాయి. దీంతో అత్యంత వైభవంగా చేయాలనుకున్న పెళ్లి, తిరిగి తన మెడకే చుట్టుకోబోతోందా? అన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి.

అక్రమ మైనింగ్ కేసులో ఇప్పటికే జైలు జీవితం అనుభవించిన గాలి, ప్రస్తుతం బెయిల్ పై బయటకు వచ్చారు. మైనింగ్ కేసులతో పాటు, న్యాయమూర్తులను కొనుగోలు చేసిన కేసుల్లోనూ గాలి చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే ఇన్ని కేసులు మెడకు చుట్టుకున్నా, జంకు లేకుండా కూతురు వివాహాన్ని ఓ రేంజ్ లో జరిపించడం ఆశ్చర్యకరమే మరి!