Gaddar to contest against kcrవచ్చే ఎన్నికలలో ప్రజా గాయకుడు గద్దర్ ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా , మరో గాయని ,ఉద్యమకారిణి విమలక్కను ఉప ముఖ్యమంత్రిగా ప్రతిపాదిస్తున్నామని ప్రముఖ దళిత మేధావి కంచ ఐలయ్య చెప్పారు. గజ్వేల్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ పై గద్దర్ ను పోటీచేయాలని కోరామని,ఆయన అంగీకరించారని ఐలయ్య తెలిపారు

మరో ఇరవై ఏళ్ల పాటు కేసీఆర్ ముఖ్యమంత్రి అని తెరాస చెబుతోందని, మరో వైపు కాంగ్రెస్ లో రెడ్లు ముఖ్యమంత్రి పదవికి పోటీపడుతున్నారని, మరి మిగిలిన వెనుకబడిన,దళిత, మైనార్టీ వర్గాలకు అవకాశం ఇవ్వరా అని ఆయన ప్రశ్నించారు. అదే సమయంలో మావోయిస్టు, న్యూ డెమొక్రసీ పార్టీలు ఎన్నికలను బహిష్కరించకుండా ఎన్నికలలో పోటీచేయాలని ఆయన పిలుపునిచ్చారు

అదే సమయంలో తాము పొత్తులకు కూడా సానుకూలంగా ఉన్నామని ఆయన చెప్పుకొచ్చారు. బిసిలకు అరవైఆరు స్థానాలు ఇచ్చే పార్టీలకు తమ మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. బహుజనులే సి.ఎమ్.కావాలని ఆయన ఆకాంక్షించారు. అయితే బహుజనులు పోటీ చేసి ప్రధాన పార్టీలకు ధీటుగా నిలబడే పరిస్థితి నేటి రాజకీయాల్లో ఉందా?