Gaddar Rejected Rahul Gandhi offerకాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో గద్దర్‌, ఆయన కుమారుడు సూర్యకిరణ్‌ భేటీ అయ్యారు. సూర్యకిరణ్ కు, మరొక ఇద్దరి తన అనుచరులకు కాంగ్రెస్ సీట్లు కేటాయించాల్సిందిగా రాహుల్ ను కోరారు గద్దర్. అయితే ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ తాను ఏ పార్టీలోనూ చేరనని, సెక్యులర్ పార్టీల మధ్య వారధిగా ఉంటానని ఆయన స్పష్టం చేసారు.

ఉత్తర తెలంగాణ, సింగరేణి ప్రాంతాలలో మహాకూటమికి ప్రచారం చేయాల్సిందిగా రాహుల్ గద్దర్ ను కోరినట్టు సమాచారం. దానికి ఆయన ఒప్పుకునట్టుగా కనిపిస్తుంది. మీడియా ముందు ఆయన తెరాస మీద విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలుకాలేదని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో కొత్త ఫ్యూడల్‌ వ్యవస్థ నడుస్తోందన్నారు.

దేశాన్ని బీజేపీ ప్రభుత్వం బందీఖానాగా మార్చిందని గద్దర్ విమర్శించారు. గద్దర్‌ను కాంగ్రెస్ నేత మధుయాష్కీ ఢిల్లీకి తీసుకెళ్లారని తెలుస్తోంది. కాంగ్రెస్ లో చేరాల్సిందిగా రాహుల్ గాంధీ సైతం ఆయనపై ఒత్తిడి చేసినా ఆయన ఆసక్తి చూపించలేదని సమాచారం.