Gaddar joining in congress partyఒకప్పుడు బుల్లెట్ తోనే రాజ్యాధికారమన్న ఉద్యమ కారుడు గద్దర్…. నేడు ప్రజాప్రతినిధిగా కొనసాగేందుకు బ్యాలెట్ వైపు మొగ్గు చూపుతున్నారు.. కరీంనగర్ జిల్లాలోని ఎస్సీ రిజర్వుడు నియోజక వర్గాలైన మానకొండూర్, చొప్పదండి, లేదా పెద్దపల్లి పార్ల మెంట్ స్థానాలకు పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

ఇక్కడ వామపక్షాల ప్రభావం ఎక్కువగా ఉండడంతో కమ్యూనిజం భావాల ఉన్న వారినే గెలిపిస్తున్నారు. కాబట్టి గద్దర్ గెలుపు తేలికగావొచ్చు . అయితే ఆయన ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతారనేది ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజల్లోకి వెళ్తున్న గద్దర్ ఆ పార్టీ లో చేరే అవకాశమైతే లేదు.

మతతత్వపార్టీలకు వ్యతిరేకం అని చెప్పుకునే ఆయన మతతత్వ పార్టీగా ముద్ర పడ్డ బీజేపీలో చేరే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం గద్దర్ తనయుడు సూర్యం చేరడంతో…భవిష్యత్ లో గద్దర్ కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిని ఆయన అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.