gaali-vaaluga-agnyaathavaasi--songsఏ సినిమా సక్సెస్ కు అయినా ‘పబ్లిసిటీ’ చాలా ముఖ్యం. క్రేజీ కాంభినేషన్ అయినా సరే… సరైనా పబ్లిసిటీ లేకపోతే బాక్సాఫీస్ వద్ద చతికిలపడక తప్పదని “స్పైడర్” నిరూపించింది. నిజానికి సినిమాలో పెద్దగా విషయం లేకపోయినా… ‘స్పైడర్’ సినిమాకు ఇచ్చిన పబ్లిసిటీ అభిమానుల సహనాన్ని పరీక్షించేలా చేసింది.

ఇటీవల కాలంలో సింగిల్ సాంగ్స్ ను విడుదల చేస్తూ పబ్లిసిటీ చేయడం తెలిసిన విషయమే. అయితే “స్పైడర్” ముందువరకు సింగిల్ సాంగ్ విడుదల అంటే… యూ ట్యూబ్ లో ప్రత్యక్షం కావడమే అని భావించేవారు. కానీ ‘స్పైడర్’ సినిమా పాటలు మాత్రం, చెప్పిన సమయంలో యూ ట్యూబ్ లో కాకుండా ప్రైవేటు మొబైల్ యాప్స్ లో ప్రత్యక్షమైంది.

దీంతో యూ ట్యూబ్ విడుదల కోసం ప్రిన్స్ అభిమానులు నిరీక్షించాల్సి వచ్చింది. తాజాగా పవన్ కళ్యాణ్ “అజ్ఞాతవాసి” కూడా ఇదే ట్రెండ్ ను కొనసాగిస్తోంది. ముందుగా యూ ట్యూబ్ లో కాకుండా, ఇతర ప్రైవేటు యాప్స్ లో విడుదల చేసిన తర్వాత యూ ట్యూబ్ లో మాత్రం లిరికల్ వీడియోతో కూడిన పాటను రిలీజ్ చేస్తున్నారు.

బహుశా యూ ట్యూబ్ కంటే ముందుగా యాప్స్ లలో విడుదల చేయడం వలన నిర్మాతకు ఆర్ధికంగా కొంత గిట్టుబాటు అయ్యే అవకాశాలు ఉన్నట్లున్నాయి. అందుకే కేవలం మహేష్, పవన్ వంటి అగ్ర హీరోలకు మాత్రమే ఇలా ముందుగా ప్రైవేటు యాప్స్ లో విడుదలైన కొన్ని గంటలకు యూ ట్యూబ్ లో ప్రత్యక్షం అవుతున్నాయి.