funds miss management in andhra pradesh bjpఏదో రకంగా ఆంధ్రప్రదేశ్ లో ఖాతా తెరిచి పరువు నిలబెట్టుకోవాలని తాపత్రయపడిన బీజేపీ హై కమాండ్ కు ఇక్కడి పరిస్థితులు అనుకూలించడం లేదు. అభ్యర్థుల ప్రచారం కోసం హై కమాండ్ 70 కోట్లు పంపిందంట. ఒక్కో నియోజకవర్గానికి 50 లక్షల చప్పున. అయితే ఇందులో ఒకే నాయకుడు 30 కోట్లు దారి మళ్లించినట్టు సమాచారం. దీనిపై హై కమాండ్ ఆగ్రహం వ్యక్తం చెయ్యడంతో విజయనగరం ఎంపీ అభ్యర్థి.. పాకలపాటి సన్యాసిరాజు కోశాధికారి పదవికి రాజీనామా చేశారు.

పోటీ నుండి కూడా తప్పుకున్నట్టు సమాచారం. బీజేపీ ఎంపీ అభ్యర్థులలో గణనీయమైన స్థాయిలో కార్యకర్తలను కూడగట్టి ప్రచారం చేస్తుంది ఆయనే. ఇవే ఆరోపణల మీద ప్రధాన కార్యదర్శి సురేశ్‌రెడ్డి రాజీనామా కూడా చేశారు. ఈయన పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. ఈయన కూడా ఎన్నికల నుండి తప్పుకున్నట్టే అని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ రాజంపేట ఎంపీ అభ్యర్థి తన నామినేషన్ విత్ డ్రా చేసుకోవడంతో అక్కడ బీజేపీ పోటీలో లేదు. దీనితో మొత్తం ఆంధ్రప్రదేశ్ లోని 25 స్థానాలకు గానూ మూడు చోట్ల బీజేపీకి అభ్యర్థులే లేరు.

వీరితో పాటు టీవీ డిబెట్లలో కనిపించే రాయలసీమ ప్రాంతానికి చెందిన మరోనేత పాత్ర కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ స్కామ్ పై బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర సహ ఇన్‌చార్జి సునీల్‌ దియోధర్‌ పై కేంద్ర పార్టీ విరుచుకుపడినట్టు సమచారం. “ఖచ్చితంగా గెలవరు అని తెలిసినా కోట్లు పంపుతుంటే కనీసం పోటీ ఇవ్వకుండా నిధులు మింగేయడం ఏంటి?’ అని కేడర్‌ వాపోతుంది. ఇది క్లుప్తంగా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పరిస్థితి.