four years for hudhud visakhapatnamహుద్హుద్ మహప్రళయానికి నేటితో మూడేళ్లు. సరిగ్గా ఇదే రోజున విశాఖ మీద కన్నెర్రజేసి ప్రకృతి విలాయతండవం చేసింది. నగరం మొత్తం కారుచీకట్లు కమ్మేసి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఐతే ఒక అలుపెరుగని యోధుడి ముందు ప్రళయం కూడా మోకరిల్లింది. ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ప్రకృతి ప్రయాళం మీద దండెత్తారు.

రోజుల పాటు ఒక బస్సునే తన ఇల్లు, ఆఫీసు చేసుకుని అధికారులను పరుగులు పెట్టించారు. ఆ పోరాటపటిమకు ప్రజల సహకారం తోడయ్యింది. రికార్డు సమయంలో విశాఖ నిలదొక్కుకుంది. విపత్తు సంభవించిన కొద్ది గంటల్లోనే విద్యుత్ సర్ఫరా పునరుధ్ధరించారు. నిత్యావసరాలకు లోటు రాకుండా జాగ్రత్త పడ్డారు.

ఐతే రాజకీయ గబ్బిలాలు విశాఖకు అడ్డుపడుతూనే ఉన్నాయి. సముద్రతీరం వల్ల విశాఖకు పెట్టుబడులు రావు అని ప్రచారం చేశాయి. మా ఓటమి వల్లే విశాఖకు ఈ దుస్థితి అని సంబరాలు చేసుకున్నాయి. ఐతే ప్రజల దీక్ష చంద్రబాబు పాలన దక్షతతో ప్రపంచంలోని పేరుమోసిన కంపనీలను విశాఖ ముంగిట నిలబెట్టాయి.

మోడేళ్ల క్రితం హుద్హుద్ వల్ల కూలిన చెట్ల వల్ల ప్రమాదం అని చంద్రబాబు ప్రభుత్వం దీపావళి వద్ధు అని పిలుపునిచ్చింది. మూడేళ్ళ తరువాత అదే దీపావళిని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విశాఖలో చేసుకోనున్నారు. విదేశీ పర్యటనలో సీఎం ఉండగా దీపావళి పండగ ఈనెల 19న వస్తోంది.

పండగకు రెండు రోజుల ముందుగా సీఎం విశాఖకు వస్తున్నారు. నగరంలోని రామకృష్ణా బీచ్‌ సముద్ర తీరంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జరగనున్న దీపావళి సంబరాల్లో పాల్గొంటారు. వీధి బాలలు, అనాధ ఆశ్రమాల్లో ఆశ్రయం పొందుతున్న చిన్నారులతో కలిసి సీఎం పండగలో పాల్గొంటారు. అదే రోజు విశాఖ నుంచే అమెరికా పర్యటనకు ఆయన బయల్ధేరనున్నారు. ప్రజల మధ్యలో హుద్హుద్ చేసిన విధ్వసాన్ని గుర్తుచేస్కుని మరింత ధృడ నిశ్చయంతో ముందుకు వెళ్ళి విశాఖను ప్రపంచపటంలో నిలబెట్టాలని ప్రతిజ్ఞ చేయిస్తారు.