Former-MLA- GV-Anjaneyuluకోనసీమ వరద బాధితులకు నాలుగు దుంపలు, నాలుగు ఉల్లిపాయలు, రెండు టోమెటోలు అంటూ లెక్కలు వేసుకొని ప్రభుత్వం సాయం అందించి చేతులు దులుపుకొంది. ప్రజల ఓట్ల కోసం గడప గడపకీ కాళ్ళు అరిగేలా తిరుగుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు ముంపు గ్రామాల వైపు కన్నెత్తి చూడలేదు.. వరద బాధితులను ఆదుకోలేదు.

ప్రభుత్వం వరద బాధితులకు అవసరమైన సాయం చేయకపోయినా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, 23 మంది ఎంపీలు తలుచుకొంటే చాలానే చేయవచ్చు. కానీ అధినేత జగన్మోహన్ రెడ్డి వరద బాధితులను కలిసినప్పుడు “నోట్లు అచ్చువేసే మెషిన్లు కేంద్ర ప్రభుత్వం వద్దే ఉన్నాయి మావద్ద లేవంటూ…” కబుర్లు చెప్పి వచ్చేసినప్పుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మాత్రం ఎందుకు ముందుకు వస్తారు?

వరద బాధితులను ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు, వైసీపీ నేతలు పట్టించుకోకపోయినా, ఎక్కడికక్కడ టిడిపి నేతలు మాత్రం ప్రజలకు అండగా నిలబడి వారికి నిత్యావసర సరుకులు అందించి సాయపడుతున్నారు.

బాపట్ల జిల్లా, వినుకొండ మండలంలో టిడిపి పల్నాడు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అధ్వర్యంలో టిడిపి నేతలు 50 క్వింటాళ్ళ కూరగాయలను కోనసీమ వరద బాధితులకి పంపించారు. సోమవారం జీవీ ఆంజనేయులు, స్థానిక టిడిపి నేతలతో కలిసి కూరగాయల లారీకి జెండా ఊపి కోనసీమకు ముంపు గ్రామాలకు పంపించారు.

అదేవిదంగా శావల్యాపురం మండలంలోని వేల్పూరు గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్తలు రెండు లారీల నిండా పశుగ్రాసాన్ని కోనసీమ ముంపు ప్రాంతాలకు పంపించారు.

ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు పీవీ సురేష్, ప్రముఖ న్యాయవాది సైదారావు, టిడిపి నాయకులు సౌదాగర్ జానీబాషా, ఆయూబ్ ఖాన్, పత్తి పూర్ణచంద్రరావు, కానాల వేంకటేశ్వర రెడ్డి, సుంకర శ్రీనివాసరావు, మీసాల మురళీకృష్ణ యాదవ్, రామకోటేశ్వరరావు, పెసల వెంకట నారాయణ, జరపాల్ గోవిందు నాయక్, బారెడ్డి వేంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.