Chandrababu-Naidu-Interviewతెలంగాణాలో కేసీఆర్ వారసత్వాన్ని కేటీఆర్ కొనసాగిస్తున్నట్లు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసత్వాన్ని జగన్ మోహన్ రెడ్డి అందిపుచ్చుకున్నట్లు మీ వారసత్వాన్ని కొనసాగించే వ్యక్తి టీడీపీలో లేరనే ప్రశ్నకు చంద్రబాబు ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అవును… జగన్ తో లోకేష్ మ్యాచ్ అవ్వలేరు, అయితే అది కరప్షన్ అంశంలో! అవినీతి అంశంలో జగన్ తో ఎవరూ పోటీపడలేరు అన్న అభిప్రాయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యక్తపరిచారు. ప్రజలను ఎవరైనా ఒక్కసారి మోసం చేస్తారు, పదే పదే చేయలేరు అంటూ ‘హిందూస్తాన్ టైమ్స్’ కుంకుం చదకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

విలువలు లేని వ్యక్తుల మధ్య ఉండలేకనే అసెంబ్లీకి వెళ్లనని చెప్పానని, కనీస గౌరవం కూడా జగన్ కు తెలియదని, గతంలో జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా తన తల్లిపై అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసారని, తాను పోరాడిన తర్వాత తప్పు ఒప్పుకుని, తన మాటలను వెనక్కి తీసుకున్నారని, కానీ జగన్ అలాంటి వ్యక్తి కాదని అభిప్రాయపడ్డారు.

అసెంబ్లీ రికార్డులను కూడా మార్చివేస్తున్నారని, తన భార్యపై చేసిన కామెంట్స్ ను రికార్డుల నుండి తొలగించిన తర్వాత ఈ డ్రామా అంతా చేసారని అధికార పక్ష తీరును ప్రస్తావించారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా స్థాపించిన పార్టీతో జతకట్టడంపై స్పందించిన బాబు, రాష్ట్రంలో జాతీయ పార్టీల ఉనికి ఇప్పుడు లేదు కాబట్టి ఇంకా కాంగ్రెస్ అంశం ఎక్కడుంటుందని అన్నారు.

అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసమే గతంలో కాంగ్రెస్ తో సంప్రదింపులు చేశామని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏదైనా చేస్తానని, ప్రజలకు మంచి పరిపాలన అందివ్వడమే ముఖ్యమని, వాటినే ప్రజలు గుర్తుంచుకుంటారు, ఒకసారి జగన్ లాంటి వ్యక్తులు మోసం చేయొచ్చు గానీ, ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలను జగన్ మేనేజ్ చేసారని, కానీ సార్వత్రిక ఎన్నికలలో అలా కుదరదని ఈ సారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు.