Chandrababu Naidu and Jagan Mohan Reddy 7 లక్షల కోట్ల రూపాయల అప్పు
అవినీతి కోసం అప్పులు
సంక్షేమం అనేది నెపం
పారదర్శకత అన్నారు, జీవోలు కూడా రహస్యం
దొంగపనులు చేస్తున్నావ్, దాచిపెడుతున్నావ్
రాష్ట్ర విభజన కంటే జగన్ రెడ్డి పాలన వలన నిర్వీర్యం
ఏపీ అంటే ప్రపంచంలో ఎవరైనా రావాలన్నా భయపడతారు
5 కోట్ల ప్రజలను దగా చేసిన ప్రధమ ముద్దాయి ఈ జగన్ రెడ్డి
దేవాలయాల పైన దాడులు… ధర్మకర్తలపై కేసులు…
కులాల, మతాల, ప్రాంతాల మధ్య విద్వేషాలతో రెచ్చకొడుతున్నారు
కరోనాకు వాక్సిన్ తీసుకుంటే సేఫ్టీ ఉంటుంది, జగన్ రెడ్డి పాలన వలన ఎవ్వరికీ సేఫ్టీ ఉండదు, ఆయన కుటుంబానికి తప్ప! అందులో కూడా తల్లి, చెల్లి ఉండరు.

ముఖ్యమంత్రి ఎలాంటి వ్యక్తని విశ్లేషణ చేస్తే ఒక ప్రొఫెషనల్ అబద్ధాలకోరు. మామూలు అబద్ధాలకోరు కాదు, ప్రతిదీ క్రిమినలైజేషన్. అది చేస్తూనే దాని పైన ఎవరైనా మాట్లాడితే దాని పైన ఎదురుదాడి, నిముషానికొక మాట, పూటకో మాట. అన్నీ అసత్యాలు ప్రచారం చేయడం… ఎక్కడ చూసినా ఫేక్ ఫిగర్సే. వాస్తవాలు చెప్పే అలవాటే లేదు.

మనకే కాదు, CAG (కాగ్) క్కూడా చెప్పరు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు కూడా చెప్పరు. ఒక అబద్ధాల కోరు అంటే, లెక్కలేనితనం అంటే ఇది. వివేకా హత్య కేసు, తెల్లవారితే గుండెపోటుగా చూపించింది అసాక్షి. సీబీఐ పైన ఎదురుదాడి చేయడం, వాళ్లకి స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేయడం, ఒక ముఖ్యమంత్రి చేయవలసిన పనులేనా?

ఢిల్లీకి ఎందుకు వెళ్లారు, వివేకా హత్య కేసు నుండి యెట్లా తప్పించుకోవాలి? ఈడీ, సీబీఐ కేసుల నుండి ఎలా రక్షించుకోవాలి? ప్రత్యేక హోదా ఏమైంధి? పోలవరం ఏమైంది? అదే సమయంలో అమరావతిని ఎం చేసారు? ఎన్ని సార్లు అమరావతి పైన మాటలు మార్చారు? కేంద్రంతో పెండింగ్ ఉన్న అంశాలపై శ్వేతపత్రం ఇస్తారా మీరు?

ముఖ్యమంత్రి అంటే ఆ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్. మరి ఇలాంటి ముఖ్యమంత్రి వలన ఇండియాలో గానీ, ప్రపంచంలో గానీ ఏపీ అంటే లెక్క చేస్తారా? ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తే ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలియజేస్తే మా వాళ్ళని అరెస్ట్ చేస్తారు, విగ్రహాన్ని కూల్చిన వారికి వకాల్తా తీసుకుంటారు. ఈ ఆఫీస్ పైన దాడి చేసిన వారే వంగవీటి రాధా ఇంటికి దగ్గర రెక్కీ నిర్వహిస్తే, ఏమి జరగలేదని డీజీపీ క్లీన్ చీట్ ఇస్తారు.

డీజీపీ గారు మీరు బెస్ట్ డీజీపీ ఇన్ ఇండియా, మీకు సన్మానం చేయాలి తొందర్లో మేమందరం. ఎందుకంటే సాక్ష్యాలు ఇచ్చినా పట్టించుకోనంత బ్రహ్మాండమైన డీజీపీ కదా నువ్వు. ఐపీఎస్ కే అర్హుడు కాదు ఇలాంటి వ్యక్తులు గుర్తు పెట్టుకో. మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం ఊడిగం చేసే పరిస్థితికి వచ్చారంటే ఏమనాలి?

– ఇది క్లుప్తంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుత జగన్ మోహన్ రెడ్డి పాలనను ఏకరువు పెడుతూ చేసిన వ్యాఖ్యలు.