Former Andhra Pradesh Chief minister Konijeti Rosaiah no moreఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించిన కొణిటి రోశయ్య శనివారం నాడు ఉదయం కాలం చేసారు. 88 ఏళ్ళ వయస్సు కలిగిన రోశయ్యకు బ్లడ్ ప్రెషర్ తక్కువ కావడంతో, స్టార్ హాస్పిటల్ కు తరలించారు. అయితే మార్గమధ్యంలోనే కొణిజేటి తుది శ్వాస ఆగిపోయినట్లుగా డాక్టర్లు ధృవీకరించారు.

అపారమైన రాజకీయ అనుభవం కలిగిన రోశయ్య ముఖ్యమంత్రిగా కంటే, ఆర్దికమంత్రిగా వైఎస్సార్ హయాంలో విశేషమైన సేవలు అందించారు. అయితే వైఎస్సార్ అకాల మరణం తర్వాత రాష్ట్రంలో అత్యంత అనుభవం కలిగిన నేతగా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టినప్పటికీ, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను తట్టుకోలేక స్వచ్ఛందంగా తన ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నారు.

ఓ పక్కన తెలంగాణ రాష్ట్రం కావాలంటూ కేసీఆర్ ఉద్యమం, మరో పక్కన సీఎం పదవి ఇవ్వలేదని కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి జగన్ చేసిన హంగామా… ఈ రెండింటి కలయికతో ఏపీ రాజకీయాలకు ‘నమస్కారం’ పెట్టి, తదుపరి పొరుగు రాష్ట్రాలకు గవర్నర్ గా విధులు నిర్వహించారు.

ఇప్పటి రాజకీయాల మాదిరి కాకుండా, పద్ధతిగా రాజకీయాలలో నడుచుకున్న నేతగా పొలిటికల్ వర్గాల్లోనే కాక, ప్రజల్లో కూడా కొణిజేటి రోశయ్య పట్ల గౌరవ భావం ఉంది. ఈ సందర్భంగా రోశయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ… ఓం శాంతి… ఓం శాంతి… ఓం శాంతి..!