JD Lakshminarayana To Join Aam Admi Party.సిబిఐ మాజీ జెడి వివి లక్ష్మీనారాయణ రాజకీయ పార్టీ పెట్టబోవడం లేదు అని స్పష్టం చేశారు.అయితే వచ్చే ఎన్నికలలో పోటీచేస్తానని ఆయన అంటున్నారు. రైతుల అభివృద్ది కోసం తాను ఎన్నికలలో పోటీచేస్తానని ప్రకటించారు. తనకు ఆప్‌ నుంచి ఆహ్వానం అందిన విషయం వాస్తవమేనని అన్నారు.

అయితే ఏ పార్టీలో చేరేదీ లక్ష్మీనారాయణ తెలియచేయలేదు. ఒకరకంగా ఆయన మంచి నిర్ణయం తీసుకున్నారనే అనుకోవాలి. అతి తక్కువ సమయం ఉండడంతో ఇప్పుడు పార్టీ పెట్టినా దాని వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. కావున ఏదన్నా పార్టీలో చేరడమే కరెక్టు. కాకపోతే ఆయన గెలుపు అవకాశాలు ఆయన చేరబోయే పార్టీని బట్టి ఉంటాయి.

కొద్ది కాలంగా ఆయన జిల్లాల పర్యటన చేస్తూ రైతులు సామాన్యుల సమస్యలను తెలుసుకునే పని ఉన్నారు. తమిళనాడులో సాధారణ పంటలమీదే ఆధారపడకుండా పట్టు, ఆక్వా, పౌల్ట్రీ, ఉద్యానవన రంగాల్లోకి వెళ్తున్న రైతులు ఎంతో లాభపడుతున్నారన్నారని, అలాగే మన రాష్ట్ర రైతులు కూడా ఆలోచన చేయాలని సూచించారు. రాజకీయాలలోకి రావడం కోసమే ఆయన తన పదవికి వాలంటరీ రెటైర్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. గతంలో జగన్ కేసుల వ్యవహారంలో నిజాయతి గల అధికారిగా పేరు తెచ్చుకున్నారు ఆయన.