for whom jagan govt give TTD chairman postతిరుమల తిరుపతి దేవస్థానం ప్రస్తుత బోర్డు కాల పరిమితి ఈ నెల 21తో పూర్తయిపోయింది. కరోనా కారణంగా తమ పదవులను పెద్దగా అనుభవించకపోవడం తో జగన్ ఇంకో మారు అవకాశం ఇస్తారని బోర్డు సభ్యులు భావించారు. అయితే అటువంటి ఉద్దేశం ఏమీ లేనట్టు టీటీడీని ప్రత్యేక అధికారి పాలనలోకి తెచ్చింది ప్రభుత్వం.

దానితో బోర్డు మార్పు తథ్యం అనే సంకేతాలు ఇచ్చింది ప్రభుత్వం. ఇది ఇలా ఉండగా… టీటీడీ చైర్మన్ పదవికి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి రేస్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన గత ఎన్నికలలో తన సిట్టింగ్ స్థానాన్ని త్యాగం చేసిన సందర్భంగా ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తామని జగన్ హామీ ఇచ్చారట.

దానితో ఆయనకు ఈసారి అవకాశం ఉందంట. అయితే ఇదే నిజమైతే జగన్ ప్రభుత్వం మీద విమర్శలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. గతంలో చంద్రబాబు హయాంలో ఈ పదవిని సొంత సామాజిక వర్గానికి ఇచ్చిన దాఖలాలు లేవు. అయితే వైఎస్ జమానాలో నుండి జగన్ రూల్ వరకు రెడ్లకే టీటీడీ అవకాశం దక్కింది.

ఇప్పువు వైవీ సుబ్బారెడ్డి రెండేళ్లు పదవి పూర్తి చేసుకోగా… మేకపాటి కి ఇంకో రెండేళ్ళ పాటు పదవి ఉంటాది. మేకపాటి ని నియమించేలోగా ఇంకో ఆరేళ్ళు పోతాయి అనుకుంటే చివరి ఆరేళ్ళు ఇంకొక వర్గానికి చెందిన వారికి అవకాశం ఇచ్చినా ఎన్నికల స్టంట్ గానే కనిపిస్తుంది.