https://mail.google.com/mail/u/0/#inbox/FMfcgzGlksBMCfGZPWgBrVLHswPfmzDwహైదరాబాద్ వంటి మంచి పౌష్టిక ఆదాయాన్ని అందించే నగరాన్ని రాష్ట్రంలో పెట్టుకున్న కేసీఆర్ సర్కార్ కూడా బిల్లులను చెల్లించలేక సతమతమవడం ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ సామర్ధ్యతను ప్రశ్నించేలా చేస్తోందన్నది రాజకీయ విమర్శకుల మాట. అది కూడా విద్యార్థులకు అందించే ‘మిడ్ డే మీల్స్’ పధకంలో కోతలు పెట్టడం మరిన్ని విమర్శలకు దారి తీస్తోంది.

గవర్నమెంట్ పాఠశాలలో మధ్యాహ్నం సమయంలో విద్యార్థులకు అందించే ఆహారంలో నాణ్యత ఉండడం లేదని, దీంతో ఈ ఆహారాన్ని భుజించటం విద్యార్థులకు భారంగా మారుతోందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే ప్రశ్నను ‘మిడ్ డే మీల్స్’ అందించే నిర్వాహకులను అడిగితే వచ్చిన సమాధానం కేసీఆర్ సర్కార్ తీరును తేటతెల్లం చేస్తోంది.

ఒక్క భోజనానికి 4.95 పైసలు మాత్రమే ప్రభుత్వం కేటాయించిందని, పెరిగిపోయిన కూరగాయలు, బియ్యం ధరలతో నాణ్యతతో కూడిన ఆహారాన్ని ఏ విధంగా అందించగలమని, అందులోనూ గత కొన్ని నెలలుగా తమకు రావాల్సిన బిల్లులను కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదని తమ గోడును వెలిబుచ్చుకున్నారు.

సంక్షేమం పేరుతో ఎన్నికల సమయంలో ఒక్కో కుటుంబానికి పది లక్షల రూపాయలను అందించిన కేసీఆర్ ప్రభుత్వం, చిన్నారులకు సరైన పౌష్టిక ఆహారాన్ని మాత్రం అందించలేకపోవడం అంటే… ఏ విధమైన బాధ్యతాయుతమైన పరిపాలన సాగిస్తుందో అంటూ విమర్శకులు పెదవి విరుస్తున్నారు.