Flyover under construction collapses in Kolkataపశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌ కతాలో జరిగిన ఘోర ప్రమాదం తెలిసిందే. నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కూలిపోవడంతో 14 మంది దుర్మరణం చెందగా, శిథిలాల కింద సుమారు 150 మంది వరకు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు సహాయక చర్యలు కొనసాగుతుండగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, సహాయ బృందాలు ప్రమాద స్థలంలో పెద్ద ఎత్తున సహాయక చర్యలు ప్రారంభించారు.

ఈ సంఘటనపై ప్రస్తుతం అమెరికాలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని అందజేస్తూ… సహాయ కార్యక్రమాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నానని ట్వీట్ చేశారు. పరిస్థితిని సమీక్షించి, సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అయితే ఈ ఫ్లై ఓవర్ కూలిన విధానంకు సంబంధించి ఓ చిన్న వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ట్రాఫిక్ లో ఉన్న కార్లపై ఒక్కసారిగా కుప్పకూలిన ఫ్లై ఓవర్ ను మీరు వీక్షించండి…