Floods in Dubai -2గతేడాది భారీ వర్షాలు చెన్నై నగరాన్ని నిట్టనిలువుగా ముంచేసిన విషయం తెలిసిందే. నగరమంతా నడి సముద్రంగా మారిన వేళ అందరూ తలో చేయి వేసి చెన్నై నగరాన్ని ఆదుకున్నారు. అయితే, నగరం అభివృద్ధి చెందినట్లుగా డ్రైనేజ్ వ్యవస్థ అభివృద్ధి చెందకపోవడం కూడా ఈ వరద ముంపుకు ఒక కారణమని అప్పట్లో విశ్లేషణలు వచ్చాయి. కానీ ప్రకృతి బీభత్సానికి డ్రైనేజ్ వ్యవస్థ ఏమీ చేయలేదని తాజాగా దుబాయ్ నిరూపిస్తోంది.

అత్యంత వైభవంగా ఉండే దుబాయ్ ను గత కొన్ని రోజులుగా వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో ప్రధాన రహదారులన్నీ కూడా వరద నీటితో దర్శనమిస్తున్నాయి. కార్లు, బిల్డింగ్ లు నీటిలో తేలియాడుతూ వాటికన్ సిటీని తలపిస్తున్నాయి. వీటికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రాలను వీక్షిస్తున్న వారికి మన చెన్నై నగరం గుర్తుకు రావడం సహజమే. ప్రకృతి బీభత్సానికి, అభివృద్ధికి సంబంధం లేదని దుబాయ్ ఉదంతం చెప్పకనే చెబుతోంది.

Floods in Dubai -1