floods in chennaiతమిళనాడును భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. గత వందేళ్ళలో కనీవనీ ఎరుగనంతగా కుండపోత వర్షం కురుస్తోంది. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో భారీగా వరదనీరు చేరడంతో విమాన సర్వీసులు నిలిపివేశారు. చెన్నైకి రావలసిన విమానాలను బెంగుళూరు ఇతర ప్రాంతాలకు మళ్ళిస్తున్నారు. అటు పలు రైళు సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమిళనాడు సీఎం జయలలితకు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి వివరాలు అడిగితెలుసుకున్నారు. తమిళనాడు అంతట స్కూళ్ళు, కాలేజీలకు ప్రభుత్వం శెలవు ప్రకటించింది.

లోతట్టు ప్రాంతాల ప్రజలను రక్షించేందుకు సైన్యం రంగంలోకి దిగింది. మరోవైపు ఏపీలో నెల్లూరు జిల్లాను కూడా రెండురోజులుగా వర్షాలు ముంచెత్తుతున్నాయి. స్వర్ణముఖి, కైవల్య వంటి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. చేతికొచ్చిన పంటలు నీట మునగడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అటు చిత్తూరు జిల్లాను కూడా వర్షాలు ముంచెత్తడంతో సహాయక చర్యలు ఊపందుకుంటున్నాయి.