flexi-on-chandrababu-naidu-governmentవిభజన రీత్యా కష్టాల కడలిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్, నేడు ఎంతోకొంత నిలదొక్కుకుందంటే… అది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాయకత్వ లక్షణాల ప్రతిభేనని చెప్పాలి. దేశ, విదేశాల్లో అమరావతి పేరును మారుమ్రోగించడంతో పాటు, రాష్ట్రానికి పెట్టుబడులను రప్పించడంలో తాను ‘కింగ్’ అని మరోసారి నిరూపించుకున్నారు.

పెట్టుబడులకు ‘చంద్రబాబు’ అన్న పేరు ఓ ‘బ్రాండ్’గా మారడంతో, ఏపీలోకి ప్రముఖ సంస్థలన్నీ ఒక్కొక్కటిగా క్యూలు కడుతున్నాయి. అలాగే గతంలో హైదరాబాద్ అభివృద్ధి విషయంలో జరిగిన తప్పును సరిదిద్దుకుంటూ ఏపీ వ్యాప్తంగా అభివృద్ధిని, సంక్షేమాన్ని అమలు పరచడంలో సక్సెస్ అయిన చంద్రబాబు గురించి సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ అంశం ‘ట్రెండింగ్’ అవుతోంది.

“మళ్ళీ నువ్వే రావాలి” అన్న పేరుతో ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, వాట్సప్ వంటి సామాజిక మాధ్యమాల వేదికలుగా చంద్రబాబు నాయుడు పోస్టర్లు హల్చల్ చేస్తున్నాయి. ఏపీ అభివృద్ధి గమనంలో పయనించాలంటే… వచ్చే ఏడాదిలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో కూడా తెలుగుదేశం విజయం సాధించి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అడుగు పెట్టాలన్నది ఈ ట్రెండింగ్ లక్ష్యం.

ఆంధ్రప్రదేశ్ లో మారుమూల గ్రామాలలో సైతం ఈ తరహా పోస్టర్లు దర్శనమిచ్చేలా… ఆయా ఊరు పేర్లతో ఈ బ్యానర్లను తయారు చేయడం విశేషం. చాలా భారీ స్థాయిలో జరుగుతోన్న ఈ క్యాంపెయిన్ లో తెలుగు తమ్ముళ్ళు ఎంతో ఉత్సాహంతో పాల్గొంటున్నారు. కేంద్రం ప్రభుత్వంతో పాటు స్థానికంగా వైసీపీ, జనసేనలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నా… రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉండాలంటే “మళ్ళీ నువ్వే రావాలి” అంటున్నారు టిడిపి ఫ్యాన్స్. మరి మీరేమంటారు..?!