Delay in 5 YSRCP MP resignation acceptance-వైకాపా ఎంపీల రాజీనామాలు ఎట్టకేలకు ఆమోదింపబడ్డాయి. రాజకీయ విశ్లేషకుల ప్రకారం ఎన్నికలకు ఏడాది లోపే ఉండడంతో ఎన్నికలు వచ్చే అవకాశం లేదని అంటున్నారు. ఎన్నికలు రాకుండా చాకచక్యంగా వ్యవహరించి రాజీనామాలు చేశారని ఎంపీలపై విమర్శలు కూడా ఉన్నాయి. వాటిని తప్పించుకోవడానికి వైకాపా ఒక కొత్త పథకంతో ముందుకు వచ్చింది.

ఉపఎన్నికలు వచ్చే అవకాశం లేదని ఒప్పుకోకుండా ఉపఎన్నికలు వస్తాయని, ఉప ఎన్నికలు వస్తే సీఎం చంద్రబాబు పోటీకి రాబోరని అన్నారు. సీఎం చంద్రబాబు గ్రాఫ్ పడిపోయిందని, చంద్రబాబువి ఉత్తరకుమార ప్రగల్భాలేనని అంటూ తాము ఉపఎన్నికలు వస్తాయనే ఉద్దేశంతోనే రాజీనామాలు చేశామని ప్రజలకు అనిపించేలా మాట్లాడుతున్నారు.

కొన్ని రోజుల తరువాత ఉపఎన్నికలు రాకపోతే అప్పుడు బీజేపీతో కలిసి చంద్రబాబు కుట్ర చేశారని, వ్యవస్థలను మేనేజ్ చేశారని ఆరోపించొచ్చని వారి ఆలోచన. అయితే ఉపఎన్నికలు రాకుండా వైకాపాకు బీజేపీ సహకరించినట్టుగా కనపడుతుంది. ఉద్దేశపూర్వకంగానే స్పీకర్ తో ఆలస్యం చేయించి ఏడాది కంటే తక్కువ సమయం ఉండేలా చూసుకున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి.